బ్యాంకు బ్యాలెన్స్ సున్నాకి వచ్చినా కూడా నా భార్య నన్ను నిలబెట్టింది
on Oct 25, 2024
'ది కపిల్ శర్మ షో'(the kapil sharma)అనే ప్రోగ్రాంకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న వ్యక్తి కపిల్ శర్మ(kapil sharma)బాలీవుడ్ సినీ పరిశమ్రలో ఉన్న ప్రముఖ కామెడీ నటుల్లో ఒకడిగా కూడా నిలిచాడు.ఎంతో మంది సినీ సెలబ్రటీస్ కపిల్ శర్మ షో లో పాల్గొని తమ లైఫ్ లో జరిగిన చాలా విషయాలని ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు.
రీసెంట్ గా కపిల్ శర్మ ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు.అందులో ఆయన మాట్లాడుతూ డబ్బుంటే ఎవరైనా నిర్మాతగా మారచ్చనే ఉద్దేశ్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి రెండు చిత్రాలు నిర్మించాను.కానీ ఆ రెండు దారుణమైన పరాజయం చెందటంతో నా డబ్బు మొత్తం పోయింది.బ్యాంకు బాలన్స్ కూడా సున్నాకు పడిపోయింది.దాంతో డబ్బు ఒక్కదానివల్లనే నిర్మాత కాలేమని తెలుసుకున్నాను.నిర్మాత అంటే అందరికంటే విభిన్నంగా ఆలోచించాలి.
ఆ విధంగా రాణించాలంటే ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోవాలి.ఈ నిజాన్ని తెలుసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దివాళా తీసే స్థాయికి దిగజారిపోయాను.ఏం చెయ్యాలో అర్ధం గాక మానసికంగా కుంగుబాటుకి కూడా గురయ్యాను.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా భార్య నాకు అండగా నిలిచింది.ఆమె సపోర్ట్ వల్లే తిరిగి నిలబడగలిగానని చెప్పుకొచ్చాడు.2015 లో కిస్ కిస్కో ప్యార్ కరో తో నటుడుగా ఎంట్రీ ఇచ్చిన కపిల్ శర్మ ఫిరంగి,సన్ ఆఫ్ మన్ జిత్ సింగ్ లని నిర్మించాడు. 2017 , 2018 లో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
Also Read